ఎండమావుల్లా ఈ
తరగని దూరాలు,
పయనించే కొద్దీ
కనుమరుగవుతున్న తీరాలు.
చుట్టుముడుతోంది శున్యమేదో
చీకటి లోకి నేట్టివేస్తున్నట్టుగా.
కరగని ఈ దూరం,
గడవని ఈ కాలం..
నువ్వు లేక ఎలానో ఉంది,
ఈ దూరం నను కాల్చుతోంది.
దగ్గరున్నప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులా నువ్వు,
దూరమైనపుడు మిగిలిపోఇన ఒక ప్రశ్నలా నేను...
కొన్ని క్షణాల నిర్వేదం,
నిర్వేదాన్నుంచి నిశబ్దం.
నిశబ్దాన్ని చేధించే కన్నీరు,
కన్నీటి ధారలో కొట్టుకుపోయిన గతం.
ఆ నిముషం తప్ప అన్ని మరిచిన నైర్మల్యం.
అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల నీ సాంగత్యం!!
పసితనం...
ఎవ్వరికీ తెలియకుండా దాచి ఉంచిన ఒక రహస్యం..
ప్రకృతి పరిష్వంగంలో ఆనందాల్ని దోసిళ్ళతో తాగిన వైనం ...
వర్షపు బిందువులతో తడిసిన పచ్చదనం .
అమ్మమ్మ ఆపేక్ష లోని పరిమళం
కాగితపు పడవలలో ప్రపంచాన్నే చుట్టిన కోలాహలం.
పచ్చికలో గడ్డివాములలో సింహాసనం..
రాజులను రాణులను జీవించిన కథనం.
ఇసుక మేడలు కట్టుకున్న భోలాతనం..
పొలాలు, తోటలలోని చిరు దొంగతనాలలో చిలిపితనం.
ఇతరుల కస్టాలు చూసి కన్నీరైన అమ్మయకత్వం ..
ప్రపంచమంతా అందమైనదని నమ్మిన నిర్మలత్వం..
స్వచ్చత తప్ప ఇంకోటి దరిచేరని ఆ పసితనం ...
నాకు మాత్రమె స్వంతమనుకున్న ఈ పరిచయం..
ఈనాడు నాకే పునః పరిచయం చేసిన 'రే'..
ఎంత ఆశ్చర్యం!!
ఇదెలా సాధ్యం!!
అందరిలోనూ దాగున్నదా?
అందరు అనుభవించినదేనా?
అందరికీ పరిచయమేనా?
మరి ఎక్కడా అగుపడదెం ?
భాద్యతల వలయంలో ,అనుభవాల చట్రంలో చిక్కుకుపోయి
వయసుడిగి ముడతలు పడిన ఆ పసితన్నాన్ని
నాలాగే అందరు కర్కశంగా గొంతు నులిమేశారా?
అంత అందమైన ప్రపంచాన్ని చేజార్చుకున్నారా?!
నిను వదిలి క్షణమైనా ఇక ఉండలేనని చెప్పాలనిపిస్తుంది
కాని చెప్పేలోగానే అది అత్యాసగా కనిపిస్తుంది ...
పెదవి దాటకుండానే మనసు మూగపోతుంది .
ఎల్లలు లేనంతగా పెరిగిన ప్రేమ నీకు చుపాలనిపిస్తుంది,
చుపెలోగానే తెలియని భయమేదో ఆవరిస్తుంది ..
కట్టడి చేయబడ్డ మనసు కన్నిటిలో మునిగిపోతుంది.
ఎటునుంచి వచ్హావో ఇంతలా నను మార్చ్చావు .
కలలు కుడా కనలేని ఈ కనులకు కంటిపాపవైనావు.
కనుల ముందే కదలాడే నీ రూపం పగలైనా ,రేయైనా..
మనసు మరవకుందే నీ ధ్యానం నేడైనా, రేపైనా .
ముందెన్నడూ లేదే ఈ పరిచయం నాతో నాకే ,
అగుపిస్తున్నా కొత్తగా నేను, నీలో కలిసాకే..
నీకై వేచిఉన్న నా కళ్లు ,నాకై వెతుకుతున్నాయి ,
నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...
నేనే నీవై, నీవే నేనై ,కలగలిసిన మన సమాగమంలో ...ఎదురుచూపులకు తావెక్కడ?అంతా నీవే అయి అగుపిస్తుంటే , ఇక విడిగా నా అస్తిత్వమెక్కడ?దూరం మనలను మార్చునా ?సమయం మనసులను ఎమార్చునా?కాలాతీతమైన మన ప్రణయాన్ని హద్దులు ఆపగలుగునా?అంతరాలెన్నిఉన్నా,అవాంతరాలు అడ్డుగా నిలుచుంటున్నా ...పడుతూ లేస్తూ ,కెరటంలోని ఆరాటమంతా తమలో నింపుకుని ,నీకై వేచిఉన్న నా కళ్లు , నాకై వెతుకుతున్నాయి .నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...