animisha
Friday, October 23, 2009
నీకై వేచిఉన్న నా కళ్లు ,నాకై వెతుకుతున్నాయి ,
నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...
నేనే నీవై, నీవే నేనై ,
కలగలిసిన మన సమాగమంలో ...
ఎదురుచూపులకు తావెక్కడ?
అంతా నీవే అయి అగుపిస్తుంటే ,
ఇక విడిగా నా అస్తిత్వమెక్కడ?
దూరం మనలను మార్చునా ?
సమయం మనసులను ఎమార్చునా?
కాలాతీతమైన మన ప్రణయాన్ని హద్దులు ఆపగలుగునా?
అంతరాలెన్నిఉన్నా,
అవాంతరాలు అడ్డుగా నిలుచుంటున్నా ...
పడుతూ లేస్తూ ,
కెరటంలోని ఆరాటమంతా తమలో నింపుకుని ,
నీకై వేచిఉన్న నా కళ్లు , నాకై వెతుకుతున్నాయి .
నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...
నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...
నేనే నీవై, నీవే నేనై ,
కలగలిసిన మన సమాగమంలో ...
ఎదురుచూపులకు తావెక్కడ?
అంతా నీవే అయి అగుపిస్తుంటే ,
ఇక విడిగా నా అస్తిత్వమెక్కడ?
దూరం మనలను మార్చునా ?
సమయం మనసులను ఎమార్చునా?
కాలాతీతమైన మన ప్రణయాన్ని హద్దులు ఆపగలుగునా?
అంతరాలెన్నిఉన్నా,
అవాంతరాలు అడ్డుగా నిలుచుంటున్నా ...
పడుతూ లేస్తూ ,
కెరటంలోని ఆరాటమంతా తమలో నింపుకుని ,
నీకై వేచిఉన్న నా కళ్లు , నాకై వెతుకుతున్నాయి .
నీలో కలిసిన నన్ను కనిపెట్టలేకున్నాయి...

0 Comments:
Post a Comment
<< Home