animisha
Saturday, August 29, 2009
కాలమనే ఋతువుల చక్రం యొక్క వేగానికి
అలిసి సొలసి ఈదురుగాలులకి ఆకులు రాలి మోడై మిగిలిన
నా జీవితంలోకి వసంతంలా మీ రాక చిగురులు తెచ్చింది.
స్వాప్నిక జగత్తును మరిపించేలా నా నేడును నా కనుల ముందు నిలిపింది .
మీతో ఈ ప్రయాణం ఇంకెన్నాల్లో తెలియదు.
మీ అభిమానపు చిరు చినుకులతో తడిసిన నాకు ,
ముందున్న గ్రీష్మం గుర్తుకురాదు.
నమ్మకమే వేరులుగా, ప్రేమే ఉపిరిగా మిమ్మల్ని అల్లుకుపోయిన నేను
కాలచక్రాన్ని చేదించటానికి కూడా సన్నద్ధమయ్యను.
రేపటితో నాకు పని లేదు ,
మీరెక్కడ ఉన్నా నాకోసం వస్తారనే నమ్మకం
ఎంతకాలమైనా మీకోసం వేచి ఉండగలననే స్థైర్యం మీరే ఇవ్వగా నాకెందుకు రేపటిపై బెంగ?

0 Comments:
Post a Comment
<< Home