animisha

Monday, November 7, 2011

ఎండమావుల్లా ఈ
తరగని దూరాలు,
పయనించే కొద్దీ
కనుమరుగవుతున్న తీరాలు.

చుట్టుముడుతోంది శున్యమేదో 
చీకటి లోకి నేట్టివేస్తున్నట్టుగా.

కరగని ఈ దూరం,
గడవని ఈ కాలం..
నువ్వు లేక ఎలానో ఉంది,
ఈ దూరం నను కాల్చుతోంది.

దగ్గరున్నప్పుడు  అన్ని ప్రశ్నలకు జవాబులా నువ్వు,
దూరమైనపుడు మిగిలిపోఇన ఒక ప్రశ్నలా నేను...

posted by mitra at 11:46 PM 0 comments

Thursday, November 3, 2011

కొన్ని క్షణాల నిర్వేదం, 
నిర్వేదాన్నుంచి నిశబ్దం.
నిశబ్దాన్ని చేధించే కన్నీరు,
కన్నీటి ధారలో కొట్టుకుపోయిన గతం.
ఆ నిముషం తప్ప అన్ని మరిచిన నైర్మల్యం.

అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల నీ సాంగత్యం!!

posted by mitra at 6:48 AM 0 comments