animisha

Tuesday, September 15, 2009

నిన్నలో కరిగిన నేడు ,
రేపటికి ఉరకలేస్తోంది .
ఆశల సంద్రంలో ఒక ఆకాంక్ష ,
ప్రేమకై చిన్దులేస్తోంది...
నీకోసమై పుట్టిన ఓ ప్రాణం ,
పయనానికి సిద్దం అవుతోంది ,
నాలో ఉన్న నేను ,
నీకై పరుగులిడుతోంది.

గగనానికే నిచ్చేనైనా ,
మనసు మాట విననంటోంది,
తీరని ఆరాటమైనా కోరికల కెరటం ,
ఉవ్వెత్తున ఎగసిపడుతోంది .
ఆవిరై ఆకాశానికెగసి,
మేఘమై నీ దరికి పయనించి ,
వర్షమై నిను ముంచేత్తబోతోంది ...
posted by mitra at 10:35 PM 1 comments

Friday, September 4, 2009

నిన్న నీకై అన్వేషణ ,

నేడు నీకై నిరీక్షణ.


నీ ఎదురుచూపులో నీవు కానక ,

తారసపడ్డ ప్రతి ఆప్యాయతలో నిన్నే వెతికిన నా నిన్న .

నీవు కాదనిపిస్తోంటే ,

వేలితేదో మనసంతా నా శున్యాన్నే చుపిస్తోంటే ,

నీవు కాని వారన్దరూ నను విడిచి వెళ్ళినప్పుడు మనసెంత కష్టపడ్డా...

నువ్వు నాకోసం వస్తావనే నమ్మకం నను నడిపిస్తోంటే...

నిను చుసిన ఆ క్షణం నాకింకా గుర్తే..


నీ ప్రపంచంలో నీవున్నా ..

నీ పలకరింపులో నాదనిపించే ఆప్యాయతేదో నను తాకగా ..

నీవో కాదో అనే సంశయంతోగడిపిన ఆ తోలి రోజులు ..

నా నీవని తెలిసిన రోజున నే పొందిన ఆనందం ...

నాకింకా గుర్తే..



posted by mitra at 1:04 AM 0 comments

నీవు.

నిను చుసిన ఈ కళ్ళకు నువ్వు కనుపాపవై ...

కనుపాపవైన నీలాగే లోకమంతా కనిపిస్తోంటే ,

లోకమంతా నీవై నా నుంచి నిన్నే చుస్తూ ..

నిన్నే చుస్తూ నన్ను నేను మరచిన మైమరుపులో ,

మైమరిపించే నిన్ను హత్తుకోవాలని కనులే మూస్తే ,

మూసిన కనులలోంచి కరిగి కన్నీరై ....

నీ రూపమే !!

posted by mitra at 12:57 AM 0 comments