animisha
Saturday, November 1, 2008
ఇది ఒక అంతులేని పోరాటం ..
నీడ జాడ సైతం తెలీని నిశి రాతిరి ,
సవ్వడిని ఆపగలదా?
సవ్వడి జోరబడని శూన్యం ,
వెలుగునాపగలదా!!
మనకంటూ ఎవరున్నారో మనసు తెలుసుకోగలదు..
మరణించాక మనకంటూ ఏమీ మిగలదు..
అంతమయ్యే పయనమైనా ఈ నిరీక్షణ ఆగదు
క్షణ భంగురమైనా జీవితం మిద ఆశ చావదు..
