animisha

Tuesday, September 30, 2008

సాధికారత, స్వాతంత్ర్యం , సంతృప్తి
మనసుకెప్పుదూఎండమావులే.
అడుగదుగో అది కావాలని పరుగిడే మనసు
ఎన్నటికి మృగ తృష్ణ తో కాలుతూనె ఉంటుంది .
ఎన్ని ఉన్నా , ఎన్నెన్ని అనుభవించినా
ఇంకా ఇంకా ఈ పరుగులాట.
మనసుకు మేధకు మధ్యన పెనుగులాట
ఎన్ని యుగాలైనా ఇలా సాగుతూనే ఉంటుంది.
తృప్తి అనునది ఎరుగని ఈ జగతి
"ఎరిగితే ఆగును ప్రగతి " అనుకుని మరీ ముందుకురుకుతుంది.
తప్పటడుగుల తన్మయత్వపు
కేళీ విన్యాసాలలో , మైమరిచి నాట్యమాడుతుంది.
క్షణంలో వాటిని మరిచి
కొత్తదనం కోసం ఉబలాటపడుతుంది.
దీనికి లేదు నిలకడ.
అందరు బానిసలే దీని కడ
తెలిసీ చేయు ఈ దాస్యం
మనసుకెంతో ప్రియం.
అస్థిరమైన భావనలతో ఉన్నా
సుస్థిరమయినదే ఔనన్నాకాదన్నా..
మన స్వాతంత్ర్యం దాని పరం
స్వాతంత్ర్యం లేని సంతృప్తి అసంభవం..
posted by mitra at 2:23 AM 1 comments

మనిషి , మనసూ,
ప్రపంచం, మానవత్వం ,
పొంతన లేని సాన్త్వనలు
అఖ్హరకు రాని సారూప్యాలు.
మనసు కోసమై నిలిచావా,
మానవత్వం మరవాలి
ప్రపంచం కోసమై పోరాదదలిచావా
మనసు మరవాలి.
రెండింటికీ మధ్య నిలిచావా
శున్యమవుతుంది జీవితం
కరువవతుంది జీవన గమ్యం
అయినా అసలేమైనా , అసలుకే లేకున్నా
ఈ జీవిత చక్రం ఆగదు.
కాలవాహినిలో కొట్టుకుపోఎదేందరో
సత్యా అసత్యాల , మంచి చెడుల
బంధనాల్లో చిక్కుకు సమిధలు అయ్యేదేందరో
ఎంతమందికి అర్థమవుతుందీ బేధం?
అవగతమైన ఎందరికి సాధ్యం ఈ సమతుల్యం?
అందుకే ఎందరివో జీవితాలు దుర్భరం.
ఈ జీవన పద్మవ్యూహం బహు అబేధ్యం.
posted by mitra at 1:59 AM 1 comments