animisha

Wednesday, July 9, 2008

నా నీకు ,
ఏమని వ్రాయను?
రాత్రి వినీలాకసంలో ,
వెలుగులు విరాజిమ్ముతున్న ఒక తారను చూసాను ,
ఎందుకో నువ్వు గుర్తోచ్చావ్ .

దాని వెలుగులో ఎంతో చల్లదనం ఉంది,
నీ సాన్నిధ్యం లాగా ...
చాలా సన్నిహితంగా ,ఎంతో అపురూపంగా,అచ్చ్చు నా దానిలా..

ఉపమానమనాలో ఏమనాలో ,
నీకు దానికి చాల సారూప్యముంది.
దూరాన ఉంటుంది,మనదే అనిపిస్తుంది .
కాని అందనిది,అందరిది,అచ్చు నీ లాగే .

వెలుగులో అది కనిపించదు ,
చీకటిలో అది ప్రకాశిస్తుంది .
నా జీవితంలోని నీ సాంగత్యం లాగ .
ఎదిపించేతంత ఎడబాటు,అంగీకరించలేనంత అంతరాలు మన మధ్య ..

వెలుగులో కానరావని వెలుగునే కాదనాలో,
ఔను అని చికటికోసం వేచి ఉండాలో..
ఉన్నా కలిసినా, కలిసిఉన్దలెమని తెలిసినా ,
నీస్తమా నీకోసం నిరీక్షిస్తూ ,
నెనున్నన్థవరకూ ..

నీ నేను .
posted by mitra at 9:49 PM 2 comments