animisha

Monday, June 30, 2008

" గదిలో ఒక మూల
నిశ్శబ్దంగా ఓర్పుగా ఒంటరిగా

అది గూడు కట్టుకుంటుంది
ఎవరిని సాయమదగకుండా
ఎవరినీ బాధించకుండా
తననుంచి తానూ విడివడుతూ
తనని తానూ త్యాగం చెసుకున్తూ
పోగు తరువాత పోగు, గొప్ప నైపుణ్యంతో ఒక డాక్టర్ నరాలను ముళ్ళు వేసినట్టు
తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.
ఒక హడావిడి ఉదయన్నో నిశ్శబ్ద సాయంత్ర సమయన్నో,
గోడమించి పెద్ద శబ్దంతో వచ్చిన చీపిరి కట్ట
ఒక్క వేటుతో దాని శ్రమ నంత సమూలంగా
తుడిచి పెట్టేస్తుంది.
సర్వనశనమైపొఇన సామ్రాజ్యం లోంచి,
సాలె పురుగు అనాధలా నెల మిద పడుతుంది.
ఎవరిని కుట్టదు ,

ఎవరి మిద కోపం చూపించదు
మల్లి తన మనుగడ కోసం
కొత్త వంతెన నిర్మించు కోటానికి
సహనం పోగులని
నమ్మకం
గోడల మిద తిరిగి స్రవిస్తంది
ఎలా బ్రతకాలో
మనిషికి పాతం చెపుతుంది ."

డా. సి.నా.రే











































posted by mitra at 9:23 PM 0 comments